న్యూజిలాండ్ కేబినెట్‌ మంత్రిగా ప్రియాంక.. అభినందనలు తెలిపిన కేటీఆర్

న్యూజిలాండ్ కేబినెట్‌ మంత్రిగా ప్రియాంక.. అభినందనలు తెలిపిన కేటీఆర్
x
Highlights

భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్(41) మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌మంత్రివర్గంలో చేరనున్న సందర్బంగా కేటీఆర్ ఆమెకి అభినందనలు తెలిపారు.

భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్(41)కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌మంత్రివర్గంలో చేరనున్న సందర్బంగా కేటీఆర్ ఆమెకి అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అమె అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.. అంతేకాకుండా ఇటివల న్యూజిలాండ్ లో జరిగిన ఎన్నికల్లో ఆ దేశానికి రెండోసారిగా ప్రధానిగా ఎన్నికైన జెసిండాకు శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్..

జెసిండా ఆర్డెర్న్‌మంత్రివర్గంలో ప్రియాంకా రాధాకృష్ణన్ కు యువజన వ్యవహారాలు, సామాజికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, డైవర్సిటీ, ఎథ్నిక్ కమ్యూనిటీస్ శాఖలను అప్పగించారు. ఇక ప్రియాంకా రాధాకృష్ణన్ కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్ ఆమె స్వస్థలం కావడం విశేషం.. ఆమె విద్యాబ్యాసం అంతా న్యూజిలాండ్ లోనే సాగింది..ఇక 2017లో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశించిన ప్రియాంక, వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు.

ఇటివల జరిగిన ఎన్నికల్లో జెసిండా ఆర్డెర్న్‌ సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో 120 సీట్లకు గాను 64 సీట్లను సాధించింది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ చరిత్రలో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది లేదు.. ఇప్పటివరకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. కోవిడ్ 19ని నియంత్రణకి గాను ఆమె చేసిన కృషినే ఈ విజయానికి కారణమని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి 49శాతం ఓట్లు రాగా.. నేషనల్‌ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక 2017లో జసిండా ఆర్డెర్న్‌ తొలిసారి ప్రధానిగా ఎన్నికైయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories