Telangana: రాబోయే రెండు వారాలు అత్యంత కీలకం : మంత్రి కేటీఆర్

Telangana: రోనా పరిస్థితి, లాక్‌డౌన్‌పై మంత్రి కేటీఆర్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో చర్చించారు.

Arun Chilukuri
Updated on: 13 May 2021 10:05 AM IST
Minister KTR Says Next 2 Weeks are Crucial
X
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌పై మంత్రి కేటీఆర్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో చర్చించారు. రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని అందరు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు దృష్టి సారించాలన్నారు. ఇంటింటీ సర్వేతో మంచి సత్ఫలితాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్‌ పేషెంట్లకు సేవలు అందిస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story