Top
logo

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
X
Highlights

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంఐఎం, బీజేపీ నేతలు మాటలు తూటాలు...

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంఐఎం, బీజేపీ నేతలు మాటలు తూటాలు వదులుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రణరంగాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నారు కదా..?4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్‌ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్‌ తోక ఎలా తొక్కాలో ఎంఐఎంకు తెలుసన్నారు.

మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ ఇద్దరు మహానీయులు తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచినవారని కొనియాడారు. ఇలాంటి మహానీయులపై అనుచిత వ్యాఖ్యల చేయడం సరికాదని హితవు పలికారు.

Web TitleTelangana minister KTR condemns Akbaruddin Owaisi comments
Next Story