ఆర్థిక మంత్రి గారూ.. మీరు ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలి : మంత్రి కేటీఆర్

ఆర్థిక మంత్రి గారూ.. మీరు ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలి : మంత్రి కేటీఆర్
x
Harish Rao, Ktr (File Photo)
Highlights

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. ప్రతి ఏడాది మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు...

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. ప్రతి ఏడాది మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్టుగానే ఈ ఏడాది కూడా శుభాకాంక్షలు తెలిపారు. 'ఆర్థిక మంత్రి గారూ.. మీరు ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలి. మీరు చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాల'ని కేటీఆర్ ఆకాంక్షించారు. బావా.. మీరు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిరంతం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతన్న మంత్రి హరీశ్ రావును మంత్రి ప్రశంసలతో ముంచేసారు. ప్రభుత్వంలో, పార్టీలో మీతో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటూ ఆనందం వ్యక్తం చేసారు.

డైనమిక్ లీడర్, నిరంతరం శ్రమించే వ్యక్తి అంటూ తన మేన బావను ఆకాశానికి ఎత్తారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ శ్రేనుల్లోని మిగతా నేతలు కూడా మంత్రి హరీశ్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న హరీశ్ రావు, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా పుట్టిన రోజు పండగకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు హరీశ్ విజ్ఙప్తి చేశారు.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి



Show Full Article
Print Article
More On
Next Story
More Stories