Telangana: ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్

Telangana: ఈటల రాజేందర్ పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2021 6:30 AM IST
Telangana: Minister Harish Rao Slams Etela Rajender
X

Telangana: ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్

Telangana: ఈటల రాజేందర్ పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనట్టుగా ఈటల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పార్టీని వీడడానికి ఆయనకు చాలా కారణాలుండొచ్చని పార్టీలో ఉండాలా వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టమని వెల్లడించారు. ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా, పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని హరీష్ రావు గుర్తు చేశారు. తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే తన పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్ర్యానికి, విజ్ఞత, విచక్షణకు నిదర్శనమని మండిపడ్డారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు వికారమైన ప్రయత్నం కూడా అన్నారు.

టీఆర్ఎస్‌లో తాను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తనని మంత్రి హరీష్ రావు అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తనకు ప్రయోజనాలే పరమావధి అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ఏ పని అప్పగించిన దాన్ని పూర్తి చేయడం తన విధి బాధ్యత అని స్పష్టం చేశారు. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం తన కర్తవ్యమన్నారు. కేసీఆర్ తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటానన్నారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ మార్గదర్శకంలోనే నడుచుకుంటాని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story