మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో శాఖల మధ్య సమన్వయం అవసరం : మంత్రి హరీశ్ రావు

మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో శాఖల మధ్య సమన్వయం అవసరం : మంత్రి హరీశ్ రావు
x

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

Highlights

Minister Harish Rao meeting on Manoharabad railway line works : మనోహరాబాద్ రైల్వే పనుల పురోగతిపై రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు న‌గ‌రంలోని ఎంసీహెచ్ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

Minister Harish Rao meeting on Manoharabad railway line works : మనోహరాబాద్ రైల్వే పనుల పురోగతిపై రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు న‌గ‌రంలోని ఎంసీహెచ్ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రైల్వే లైన్ ప‌నుల‌ను వీలైనంత తొంద‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రైల్వే పనులు వేగంగా జరగాలంటే శాఖల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పనుల్లో జాప్యం చేయకూడదని ఆయన అదికారులకు చెప్పారు. ఇది ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రైల్వే లైన్ అని తెలిపారు.

ఆరు రిజర్వాయర్లు గుండా ఈ రైల్వే లైన్ వెళ్తున్న‌ట్లు చెప్పారు. జిల్లా‌కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోని భూసేకరణ పనులు పూర్తి చేయాల‌న్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం గుండా‌ లైన్ వైళ్తున్న‌ట్లు తెలిపారు. రైల్వే పనులు జరిగే చోట విద్యుత్ లైన్లు మార్చాల్సి వస్తే ఆ పనులను విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి వేగవంతంగా పూర్తి‌చేయాల‌న్నారు. మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. రైల్వే ద్వారానే రిజర్వాయర్ లో పెంచే చేపలు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. రైల్వే పనులకు అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుంద‌న్నారు. ఈ నెలాఖరులోగా రైల్వే లైన్ కు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తి చేయాల‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతానికి రానున్న‌ట్లు తెలిపారు. కావునా వీలైనంత త్వరగా పనుల‌ను పూర్తి చేయాల‌న్నారు. కాగా రైల్వే అధికారులు కూడా కేంద్ర నుంచి వచ్చే వాటా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories