Harish Rao: ప్రధాని మోడీ తెలంగాణపై తన అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు

Harish Rao: రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉంది

Rama Rao
Updated on: 8 Feb 2022 3:16 PM IST
Telangana Minister Harish Rao Comments on PM Narendra Modi
X

Harish Rao: రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉంది

Harish Rao: ప్రధాని మోడీ తెలంగాణపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర విభజన నాటినుంచే తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన ఇన్నాళ్ల తర్వాత మోడీ రాజ్యసభలో తెలంగాణ విభజన సరిగా జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణలో వందలాది మంది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు మంత్రి హరీష‌రావు. ఆనాడు కాకినాడ తీర్మానాన్ని బీజేపీ అమలు చేసుంటే ఎప్పుడో ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఉండేదన్నారు మంత్రి హరీష్ రావు.

రాష్ట్ర విభజన రాత్రికి రాత్రే జరిగిందంటున్న ప్రధాని మోడీ మరి రాత్రికి రాత్రే ఏడు మండలాలను ఆంద్రాలో ఎలా కలిపారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఎవరిని అడిగి ఏడు మండలాలను కలిపారని ప్రశ్నించారు. సీలేరు పవర్ ప్లాంటును సైతం ఆంద్రాలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story