Harish Rao: బీజేపీ నేతలు కులాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారిస్తున్నారు

Harish Rao: సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి నీటిని పారిస్తున్నారు

Rama Rao
Updated on: 23 Feb 2022 6:46 AM IST
Telangana Minister Harish Rao Comments on BJP | TS News Today
X

Harish Rao: బీజేపీ నేతలు కులాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారిస్తున్నారు

Harish Rao: నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసిఆర్ అని, భారత దేశంలోనే నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి రక్తాన్ని పారిస్తుంటే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి నీటిని పారిస్తున్నారని అన్నారు.

తెలంగాణలోని సగం జిల్లాలకు వరప్రదాయిని అయిన కొమురవెళ్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ మేరకు జలాశయం వద్ద సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు.

Rama Rao

Rama Rao

Next Story