స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో.. ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ..

Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి ఓ నిండు ప్రాణం బలైపోయింది.

Arun Chilukuri
Published on: 25 Nov 2021 7:39 PM IST
Telangana man Dies After Losing Money in Cryptocurrency
X

స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో.. ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ..

Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో 70 లక్షలు పొగొట్టుకున్న ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి దిక్కుతోచని పరిస్థితుల్లో సూర్యాపేటలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం నగరానికి చెందిన రామలింగస్వామి ఓ మధ్యవర్తి ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ క్రిప్టో యాప్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో 70 లక్షల రూపాయలు వరకు అప్పలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆయన కారు లాక్కోవడంతో పాటు ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టించుకుని వేధింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి భరించలేక రామలింగస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు.

'ఆన్‌లైన్‌ బిజినెస్‌లో లాసయ్యాను. నాతో పాటు చాలా మంది నష్టపోయారు. అంతేకానీ నేను ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వాతీ.. పిల్లలు జాగ్రత్త. ఇలా చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశాను. అర్థం చేసుకో'అంటూ సూసైడ్‌ లెటర్‌లో రామలింగ స్వామి భార్యనుద్దేశించి రాసినట్టు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story