తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Telangana: ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 May 2024 9:30 AM IST
Telangana Lok Sabha Election Live Updates
X

తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 

Telangana: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. ఉదయం 8గంటల నుంచి మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు.. ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. క్యూ లైన్ పాటిస్తూ.. చేతికి సిరా ఆంటించుకుంటున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..ఏర్పాట్లు చేశారు. చైర్లు, నీళ్లను అందుబాటులో ఉంచారు. ఎండ నేపథ్యంలో టెంట్లు కూడా వేశారు. ఐతే మధ్యాహ్నం ఎండ వేడి పెరుగుతుందనే ముందు జాగ్రత్తతో సాధ్యమైనంత మేర ఆలోపే ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తున్నారు ఓటర్లు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story