KTR: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల: బీఆర్‌ఎస్‌దే గెలుపు అని కేటీఆర్ ధీమా

KTR: తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 29 Sept 2025 2:45 PM IST
KTR: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల: బీఆర్‌ఎస్‌దే గెలుపు అని కేటీఆర్ ధీమా
X

KTR: తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఆ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకే 'బాకీ కార్డులు' తీసుకొచ్చినట్లు తెలిపారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు 'గ్యారెంటీ కార్డుల' పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించారని, 'అభయహస్తం' కాస్తా 'భస్మాసుర హస్తం'గా మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకే తమ పార్టీ 'బాకీ కార్డులు' ప్రవేశపెట్టిందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఉన్న హైదరాబాద్‌ను పట్టించుకోకుండా, కొత్త నగరాన్ని నిర్మిస్తానని ఆయన ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story