Liberation Day: తెలంగాణ భవన్ లో ఘనంగా విలీన దినోత్సవ వేడుకలు

Liberation Day: జాతీయ జెండా ఎగురవేసిన కేకే

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 12:51 PM IST
Telangana Liberation Day celebrations at Telangana Bhavan
X
తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవం వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Liberation Day: హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కె.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు. సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం జరుపుకోవడంపై వివాదాలు అనవసరమని అన్నారు. భారత్ లో మనం కూడా విలీనం కావాలని కోరుకున్నామని. ఈ అంశంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story