టీజేఎస్ ము‌ఖ్యనాయకుల రహస్య సమావేశం.. పార్టీని విలీనం చేయాలని...

TJS Meeting: మరికొందరు ఇతర పార్టీలతో కలిసి పని చేద్దామని సూచన...

Shireesha
Updated on: 27 March 2022 7:21 AM IST
Telangana Jana Samithi Main Leaders Secret Meeting under Kodandaram | Live News
X

టీజేఎస్ ము‌ఖ్యనాయకుల రహస్య సమావేశం.. పార్టీని విలీనం చేయాలని...

TJS Meeting: తెలంగాణ జనసమితి ముఖ్య నాయకులు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కోదండరామ్ అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ మేధోమధన సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యనాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీని విలీనం చేయాలని రెండు జాతీయ పార్టీల నుంచి ప్రతిపాదనలు రావడం.. ఇక తాజాగా ఆమ్‌ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని జాతీయ నాయకత్వం కూడా ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. సభ్యుల్లో కొంతమంది పార్టీని విలీనం చేద్దామని..

మరికొందరు ఇతర పార్టీలతో కలిసి పని చేద్దామని సూచించినట్లు సమాచారం. అయితే ఎన్నికల వరకు వేచి చూద్దామని కోదండరామ్ అన్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు.. అనుబంధ సంఘాల నియామకం, ప్లీనరీలో తీర్మానం చేసిన అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 24 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని.. అక్కడ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story