Allipoola Vennela Song 2021: తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట విడుదల

* సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌‌‌, దర్శకత్వం : గౌతమ్‌ మీనన్‌

Sandeep Reddy
Published on: 5 Oct 2021 5:40 PM IST
Telangana Jagruthi Bathukamma Song 2021 Allipoola Vennela Song Released Today 05 10 2021
X

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" విడుదల (ట్విట్టర్ ఫోటో)

Allipoola Vennela Song 2021: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణా ప్రజలు జరుపుకునే బతుకుమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పాట తాజాగా విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ బతుకమ్మ పాటకు సంగీతం అందించగా‌, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ పాటకు దర్శకత్వం వహించారు. భారత సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు కలిసి ఈ పాటను రూపొందించడంతో దేశవ్యాప్తంగా ఈ బతుకమ్మ పాటకు మరింత క్రేజ్ రానుంది.

"అల్లిపూల వెన్నెల" అంటూ మొదలయ్యే ఈ సాంగ్ ని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. పాట విడుదలైన కొద్దిసేపటికి మంచి వ్యూస్ తో శ్రోతలను తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటకి లిరిక్స్ మిట్టపల్లి సురేందర్ అందించగా, బృందా మాస్టర్ కోరియోగ్రఫర్ గా పని చేశారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story