Rajat Kumar: పోలవరం బ్యాక్ వాటర్ వల్ల లక్షల ఎకరాలు మునిగిపోతాయి

Rajat Kumar: బ్యాక్ వాటర్ నష్టం, ఇతర అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించ లేదు

Rama Rao
Published on: 20 July 2022 3:41 PM IST
Telangana Irrigation Department says that lakhs of acres will Effect By Polavaram backwater
X

Rajat Kumar: పోలవరం బ్యాక్ వాటర్ వల్ల లక్షల ఎకరాలు మునిగిపోతాయి

Rajat Kumar: పోలవరం బ్యాక్ వాటర్ వల్ల లక్షల ఎకరాలు మునిగిపోతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. వరదలు, ప్రాజెక్టుల ముప్పు , భద్రత అంశాలపై జల సౌధలో భారీ నీటి పారుదల శాఖ సమీక్ష నిర్వహించింది. ఈసందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ బ్యాక్ వాటర్ నష్టం, ఇతర అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించ లేదన్నారు. బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామన్నారు. భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 20 కోట్ల నుంచి 25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రజత్ కుమార్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story