Inter Supplementary Exams 2025: మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

Telangana Inter Supplementary Exams 2025 Schedule Halltickets Results
x

Inter Supplementary Exams 2025: మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Telangana Inter Advanced Supplementary Exams 2025) ఈ నెల మే 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

Inter Supplementary Exams 2025: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Telangana Inter Advanced Supplementary Exams 2025) ఈ నెల మే 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

వీరిలో

ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సు — 2,49,032 మంది

ఒకేషనల్ కోర్సు — 16,994 మంది

సెకండ్ ఇయర్ జనరల్ — 1,34,341 మంది

ఒకేషనల్ పరీక్షలు — 12,357 మంది

దరఖాస్తు చేసుకున్నారు. గత నెల ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్‌లో 1.91 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినా, మెరుగైన ఫలితాల కోసం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు అనేక మంది దరఖాస్తు చేయడంతో మొత్తం సంఖ్య పెరిగింది.

పరీక్షల షెడ్యూల్

ఈ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు జరగనున్నాయి.

ఫస్ట్ ఇయర్ పరీక్షలు — ఉదయం 9:00AM నుండి 12:00PM వరకు

సెకండ్ ఇయర్ పరీక్షలు — మధ్యాహ్నం 2:30PM నుండి 5:30PM వరకు

ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే సబ్జెక్టుల వారీ షెడ్యూల్ విడుదల చేసింది.

హాల్‌టికెట్లు & ఫలితాల వివరాలు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం హాల్‌టికెట్లు 2-3 రోజుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు పూర్తయ్యాక 10-15 రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories