TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలు చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Arun Chilukuri
Updated on: 28 Jun 2021 4:46 PM IST
Telangana Inter Second Year Results 2021 Released
X

TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలు చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫీజు చెల్లించిన ప్రతిఒక్కరు పాస్‌ అయినట్టుగా మంత్రి ప్రకటించారు. ఫీజు చెల్లించిన 4లక్షల 51వేల 585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులను వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తర్వాత వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

మొత్తం 2లక్షల 28వేల 754 మంది బాలికలు, 2లక్షల 22వేల 831 మంది బాలురు కాగా వారిలో లక్షా 76వేల 719 మందికి "A" గ్రేడ్, లక్షా 4వేల 886 మందికి "B" గ్రేడ్, 61వేల 887 మందికి "C" గ్రేడ్, లక్షా 8వేల 93 మందికి "D" గ్రేడ్ సాధించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు వంద శాతం మార్కులు వేసినట్టు వెల్లడించారు. ఫలితాలను https://results.cgg.gov.in/, http://examresults.ts.nic.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story