జూలై 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం...

Telangana Inter Annual Calendar 2022-23 Released | Live News Today
x

జూలై 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం...

Highlights

Inter Annual Calendar: 2022-23 తెలంగాణ ఇంటర్ వార్షిక క్యాలెండర్ విడుదల...

Inter Annual Calendar 2022-23: 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఇంట‌ర్ షెడ్యూల్ 221 ప‌ని దినాల‌తో కూడి ఉంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది.

అక్టోబ‌ర్ 2 నుంచి 9 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఇవ్వ‌నున్న‌ట్లుగా బోర్డు పేర్కొంది. ఇక ఫిబ్ర‌వ‌రి 20 నుంచి మార్చి 6 వ‌ర‌కు ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ‌ర‌కు వార్షిక ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories