TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రద్దు

Telangana Inter 2nd Year Exams Cancelled
x

TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రద్దు

Highlights

TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రద్దు..గత సంవత్సరం లాగానే విద్యార్థుల ను ప్రమోట్ చేస్తూ నిర్ణయం

TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యాయి. ఇప్పటికే ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం సెకండియర్ పరీక్షల పై కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసిన సమయంలో కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జూన్ మాసంలో సమీక్ష చేసి నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories