Telangana: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

Telangana: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది.

Arun Chilukuri
Updated on: 2 Dec 2021 2:29 PM IST
DMH Srinivas Rao
X

Telangana: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

Telangana: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జీనోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించామని తెలంగాణ వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story