IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్!

IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Arun Chilukuri
Published on: 11 Feb 2026 11:05 AM IST
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్!
X

IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించడం గమనార్హం.

మరికొన్ని కీలక మార్పులు ఇవే:

సవ్యసాచి ఘోష్: ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్ బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు.

దివ్య: పంచాయతీరాజ్ కమిషనర్‌గా ఈమెకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

సందీప్‌కుమార్ సుల్తానియా: ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

కాత్యాయనీ దేవి: ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా బదిలీ అయ్యారు. దీనితో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

మయాంక్ మిట్టల్: హైదరాబాద్ జలమండలి (HMWSSB) జేఎండీగా నియమితులయ్యారు.

రఘురామ్ శర్మ: పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్‌డీగా కూడా తన బాధ్యతలను కొనసాగిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story