School Holidays 2025: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. పూర్తి జాబితా ఇదే

School Holidays 2025: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. పూర్తి జాబితా ఇదే
x
Highlights

Telangana Holidays List 2025: తెలంగాణ సర్కార్ విద్యార్థులు, ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించింది. 2025 ఏడాదికి గాను తెలంగాణ ప్రభుత్వ సెలవులు...

Telangana Holidays List 2025: తెలంగాణ సర్కార్ విద్యార్థులు, ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించింది. 2025 ఏడాదికి గాను తెలంగాణ ప్రభుత్వ సెలవులు జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికి సంబంధించి సాధారణ ఆప్షనల్ సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23ఆప్షనల్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ జాబితా జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

ముఖ్యమైన తేదీలు:

సంక్రాంతి: జనవరి 14

ఉగాది: మార్చి 30

వినాయక చవితి: ఆగస్టు 27

దసరా: అక్టోబర్ 2

దీపావళి: అక్టోబర్ 20

జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ఇస్తూ ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటించార. బోనాల పండగకు సెలవు ప్రకటించడంతో రంజాన్, దసరా తదుపరి రోజులు కూడా సెలవు ఇచ్చారు. అయితే జూన్ నెలలో ఒక్కరోజూ కూడా సాధారణ సెలవు ఇవ్వలేదు.

2025 సాధారణ సెలవుల జాబితా:

నూతన సంవత్సరం – జనవరి 1

భోగి – జనవరి 13

సంక్రాంతి – జనవరి 14

రిపబ్లిక్ డే – జనవరి 26

మహా శివరాత్రి – ఫిబ్రవరి 26

హోలీ – మార్చి 14

ఉగాది – మార్చి 30

ఈద్ ఉల్ ఫితర్ – మార్చి 31

రంజాన్ – ఏప్రిల్ 1

బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5

శ్రీరామ నవమి – ఏప్రిల్ 6

అంబేడ్కర్ జయంతి – ఏప్రిల్ 14

గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 18

బక్రీద్ – జూన్ 7

మొహర్రం – జులై 6

బోనాలు – జులై 21

స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15

శ్రీ కృష్ణాష్టమి – ఆగస్టు 16

వినాయక చవితి – ఆగస్టు 27

ఈద్ మిలాదు నబీ – సెప్టెంబర్ 5

బతుకమ్మ మొదటి రోజు – సెప్టెంబర్ 21

దసరా/గాంధీ జయంతి – అక్టోబర్ 2

విజయదశమి తర్వాతి రోజు – అక్టోబర్ 3

దీపావళి – అక్టోబర్ 20

కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి – నవంబర్ 5

క్రిస్మస్ – డిసెంబర్ 25

క్రిస్మస్ తర్వాతి రోజు – డిసెంబర్ 26

రాష్ట్రంలోని ఉద్యోగులు, విద్యార్థులు ఈ సెలవులతో పనులు సులభం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పండగలు, ప్రత్యేక సందర్భాలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది. మొత్తంమీద తెలంగాణ ప్రజలకు 2025 ఏడాది పండగల సందడి, విశ్రాంతి సమయాలకు అనుకూలంగా ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories