High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు

High Court: కోల్‌కత్తా నుంచి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, మధ్యప్రదేశ్ నుంచి జస్టిస్ సుజయ్ పాల్

Jyothi
Published on: 15 Feb 2024 8:24 AM IST
Telangana High Court Will Get Two New Judges
X

High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు 

High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు రానున్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలన్న ఆయా న్యాయమూర్తుల విన్నపాన్ని ఆమోదించినట్టు కొలీజియం తెలిపింది.

కలకత్తా హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కొలీజియం‌ను కోరారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో తన కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నందున, అక్కడ్నుంచి బదిలీ చేయాలని జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ కోరారు. న్యాయ పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీ చేయడానికి ఆమోదిస్తున్నామని కొలీజియం పేర్కొన్నది.

Jyothi

Jyothi

Next Story