తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

TS High Court: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది

Jyothi
Published on: 9 Aug 2022 9:57 AM IST
Telangana High Court Stays on Adjustment Process of VROs
X

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

TS High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై కోర్టు స్టే విధించింది. జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయ పడ్డ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు ఆజీవో నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ జారీ చేసిన జీవోలోని మూడో పేరాలోని కొన్ని విషయాలు యాక్ట్‌4/1కి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. అందుకే జీవో అమలును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే వేరే శాఖల్లో బాధ్యతలు చేపట్టని ఉద్యోగులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story