Telangana: రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రానికి టీఎస్‌ హైకోర్టు విన్నపం

Telangana: రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ హైకోర్టు.

Arun Chilukuri
Published on: 5 May 2021 3:19 PM IST
Telangana High Court Requested the Center to supply the Required Oxygen to the State
X

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఇమేజ్ )


Telangana: రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ హైకోర్టు. రోజుకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల్లో అడ్వైజరీ కమిటీ నియమించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులు 24 గంటల్లోనే ఇవ్వాలన్న ధర్మాసనం రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. ఏపీ నుంచి కొత్త స్ట్రెయిన్ వైరస్ వస్తున్న నేపథ్యంలో ఏపీ-టీఎస్‌ సరిహద్దు దగ్గర పటిష్ట చర్యలు చేపట్టాలని హెచ్చరించింది హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story