Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు

Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 3:01 PM IST
Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు
X

Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు

Telangana High Court: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story