Telangana High Court: గ్రూప్‌-1 ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట

Telangana High Court: గ్రూప్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 11:16 AM IST
Telangana High Court: గ్రూప్‌-1 ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
X

Telangana High Court: గ్రూప్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాలపై సింగిల్‌ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్‌ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్‌ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story