జేఎన్టీయూకు హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంసెట్ కౌన్సిలింగ్‌ నిలిపేయాలని ఆదేశం

జేఎన్టీయూకు హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంసెట్ కౌన్సిలింగ్‌ నిలిపేయాలని ఆదేశం
x
Highlights

జేఎన్టీయూ రెండో ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ జరగనున్న కౌన్సిలింగ్‌ను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది....

జేఎన్టీయూ రెండో ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ జరగనున్న కౌన్సిలింగ్‌ను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ కారణంగా సప్లిమెంటరీ నిర్వహించకుండానే విద్యార్థులను 35 శాతం మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. దీంతో ఎంసెట్ కౌన్సిలింగ్‌కు అర్హత కోల్పోయిన విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కౌన్సిలింగ్ ఆపాలని తెలిపింది. అయితే ఎంసెట్ నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందన్నారు అడ్వకేట్ జనరల్‌.దీంతో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గురువారం జరిగే కౌన్సెలింగ్‌కు అడ్డుకట్ట పడినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories