బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

Telangana High Court: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌లో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 14 March 2022 8:16 PM IST
Telangana High Court Key Order to Assembly over Suspension of BJP Mlas
X

బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

Telangana High Court: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌లో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్‌పై స్పీకర్‌కు రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కోర్టు సూచించింది. రేపు ఉదయం లోపు స్పీకర్‌కు అభ్యర్థన చేసుకోవచ్చన్న హైకోర్టు, ఎమ్మెల్యేలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని అభిప్రాయపడింది.

పలు కోర్టు తీర్పులను ప్రస్తావించిన హైకోర్టు అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అభిప్రాయపడింది కోర్టు. స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story