Hyderabad: పబ్‌ నిర్వాహకులకు హైకోర్ట్‌ షాక్‌.. డిసెంబర్‌ 31 రాత్రి 10 గంటలు దాటితే డీజేలు బంద్‌..

Hyderabad: హైదరాబాద్‌లోని పలు పబ్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 30 Dec 2022 3:27 PM IST
Telangana High Court Key Decision on Hyderabad Pubs
X

Hyderabad: పబ్‌ నిర్వాహకులకు హైకోర్ట్‌ షాక్‌.. డిసెంబర్‌ 31 రాత్రి 10 గంటలు దాటితే డీజేలు బంద్‌..

Hyderabad: హైదరాబాద్‌లోని పలు పబ్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని 10 పబ్‌లో రాత్రి 10 తర్వాత మ్యూజిక్ (సౌండ్) పెట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై పబ్ నిర్వాహకులు వెకెట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యూఇయర్ వేడుకల్లోను ఆంక్షలు పాటించాల్సిందేనని హెచ్చరించింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్‌ సౌండ్‌ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story