KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 Jun 2024 10:21 AM IST
Telangana High Court Issued Notices to KTR
X

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేటీఆర్‌ నామినేసన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. కేటీఆర్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల ఆర్‌వోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story