సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

X
Highlights
బ్యాలెట్ పేపర్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్రలున్న ఓట్లను లెక్కలోకి తీసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన...
Arun Chilukuri5 Dec 2020 6:38 AM GMT
బ్యాలెట్ పేపర్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్రలున్న ఓట్లను లెక్కలోకి తీసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్ చేసింది. ఎస్‌ఈసీ అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు తెలిపింది. నెరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. అయితే సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యక అభ్యంతరం ఉంటే, అప్పీలు చేయాలని హైకోర్టు సూచించింది. సోమవారం ఉదయం మొదటి అంశమే విచారణ జరపాలని సింగిల్ జడ్జికి హైకోర్టు ఆదేశించింది.
Web TitleTelangana High Court hears the state election commission petition
Next Story