తెలంగాణలో ఆంక్షలు విధించండి.. హైకోర్టు ఆదేశం..

Telangana: తెలంగాణలో కొవిడ్ ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది.

Arun Chilukuri
Published on: 23 Dec 2021 12:30 PM IST
Telangana High Court Hearing On Covid Situation in State
X

తెలంగాణలో ఆంక్షలు విధించండి.. హైకోర్టు ఆదేశం..

Telangana: తెలంగాణలో కొవిడ్ ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఎయిర్ పోర్టులో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తగిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఏ విధంగా నిబంధనలు విధించారో అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story