31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
x

31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

Highlights

Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆరా తీసింది.

Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆరా తీసింది. కోవిడ్ నేపధ్యంలో తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. లక్షలాది మంది పాల్గొనే సమ్మక్క, సారక్క జాతర కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీసింది. అలాగే వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపైనా నివేదిక కోరింది. ఈనెల 31 నుంచి స్కూళ్లు తెరవొచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపధ్యంలో పాఠశాలలు తెరుస్తున్నారా అనీ ప్రశ్నించింది. పాఠశాలలు ప్రారంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories