TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది.

Arun Chilukuri
Updated on: 11 Aug 2021 6:25 PM IST
TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
X

TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. రానున్న పండుగలు, ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనాలు ఒకే దగ్గర గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. అందుకు వీలైనంత త్వరగా ఆంక్షలు, మార్గదర్శకాలను విడుదల చేయాలని వెల్లడించింది.

ఇతర రాష్ట్రాల మాదిరిగానే వివిధ అంశాల ఆధారంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. సీరో సర్వైలెన్స్ వివరాలను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పింది. కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశం వివరాలను సమర్పించాలని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story