టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

Arun Chilukuri
Published on: 12 Nov 2020 2:45 PM IST
టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం
X

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు డిసెంబర్ 10లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని రేవంత్ రెడ్డి పిల్‌ వేశారు. కేసు దర్యాప్తు కేంద్ర సంస్థలకు అప్పగించాలని కోరారు. ఈడీ, ఎన్‌సీబీ విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాయన్న న్యాయవాది రచనా రెడ్డి, ప్రభుత్వం వివరాలు ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపింది. దీంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story