TS High Court: విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు అదేశం

TS High Court: నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలి

Rama Rao
Updated on: 3 Feb 2022 2:20 PM IST
Telangana High Court has Directed to Continue Online Teaching in Educational Institutions
X

 విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు అదేశం

TS High Court: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని తెలిపింది. నగరంలో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో కోవిడ్‌ నియంత్రణ చర్యలు అమలు చేయాలని తెలపింది.

సమతామూర్తి సహస్రాబ్దివేడుకల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపింది హైకోర్టు. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.


Rama Rao

Rama Rao

Next Story