తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. సెలవులు రద్దు..

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.. సెలవులు రద్దు..
x
Highlights

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్...

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో న్యాయస్థానాలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం మే 4వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కోర్టులకు వేసవి సెలవులు ఉంటాయి. అయితే ఈ (2020 ) సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఈ ఏడాదికి వేసవి సెలవులను రద్దు చేయాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇది హైకోర్టు, కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అధారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేన్, అర్బిట్రేషన్ సెంటర్లకు కూడా ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories