Telangana: సీఎం కేసీఆర్‌ సభకు లైన్‌ క్లియర్‌

Telangana: నాగార్జున‌సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈనెల 14న హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ జరగనుంది.

Arun Chilukuri
Published on: 12 April 2021 5:06 PM IST
Telangana: High Court Gives Green Signal To CM KCRs Haliya Sabha
X

Telangana: సీఎం కేసీఆర్‌ సభకు లైన్‌ క్లియర్‌

Telangana: నాగార్జున‌సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈనెల 14న హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ జరగనుంది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో కేసీఆర్‌ సభను రద్దు చేయాలని హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు. ఈ పిటిషన్లపై విచారణకు నిరాకరించింది హైకోర్టు. రోస్టర్‌ ఉన్న బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని రిజస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు ఉండగా ఎల్లుండే హాలియాలో సభ జరగనుంది. దీంతో కేసీఆర్‌ సభకు లైన్‌ క్లియర్‌ అయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story