Telangana: 111 జీవో ఉంటుందా.. ఉండదా..?

Telangana Govt Will Soon Lift GO 111 Announces CM KCR
x

Telangana: సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయంపై ఉత్కంఠ

Highlights

Telangana: సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయంపై ఉత్కంఠ

Telangana: హైదరాబాద్ నగర నీటి అవసరాలు తీర్చే జంట జలశయాల పరిరక్షణ కోసం తీసుకు వచ్చిన 111 జీవో ఉంటుందా ఉండదా అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతుంది. తాజాగా ఈ జీవోపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఉత్కంఠ కల్గిస్తుంది. గతంలో నియమించిన కమిటీనే యధావిధిగా కొనసాగిస్తారా లేక కొత్త కమిటీని నియమిస్తారా.. కమిటి ఏర్పాటు చేస్తే ఎంత మంది సభ్యులు ఉంటారు. ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వమే కమిటీ నియమిస్తున్నందున ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జీవో 111 అంశంలో నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2016 డిసెంబర్ 7న ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ నియమించింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీ ఎటూ తేల్చక పోవడంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ త్వరలో నిపుణులతో కూడిన కమిటీ నియమించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేయాలని భావిస్తున్న ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసే క్రమంలో త్వరలో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ తయారు చేయబోయే నివేదికలతో పాటు త్రిబుల్ వన్ జీవో అంశంపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వీటిపై వివరాలు తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ సమావేశ తేదీలు ఇంకా ఖరారు చేయలేదు.

త్రిబుల్ వన్ జీవో ఎత్తివేసే క్రమంలో ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్నది తేలాల్సి ఉంది. మరో వైపు జీవో ఎత్తివేయడం వల్ల లక్షా 32 వేల ఆరు వందల ఎకరాల భూమి మిగిలే అవకాశం ఉంది. జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. త్రిబుల్ వన్ జీవో అంశంపై ప్రభుత్వం కొత్తగా నియమించాలనుకుంటున్న కమిటీలో పర్యావరణ పరిక్షణకు పాటు పడుతున్న శాస్త్రవేత్తలకు కూడా అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఇక 111 జీవో రద్దు తో ప్రభుత్వనికి భారీగా ప్రయోజనం చేకూరనున్న ఇతర ఇబ్బందులు తప్పేలా లేవు. 111 జీవో రద్దుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి కాంక్రీట్ అరణ్యంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే త్వరలో పలువురు రిటైర్డ్ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులను న్యాయనిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టుతో పాటు ట్రిబ్యునల్ కు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories