TS News: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Telangana Govt Transfers 29 IPS Officers
x

TS News: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Highlights

TS News: 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

TS News: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. 29 మంది IPSఅధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ రతన్‌ను నియమించారు. పోలీసు అకాడమీ డెరెక్టర్‌గా సందీప్‌ శాండిల్య, ఆర్గనైజేషన్‌, లీగల్‌ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అదనపు డీజీగా శివధర్‌ రెడ్డి, పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, మహిళా భద్రత, షీటీమ్స్‌ అదనపు డీజీగా షికా గోయల్‌, TSSP బెటాలియన్‌ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్‌ ఆక్టోపస్‌ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా నాగిరెడ్డి, హైదరాబాద్‌ లా అండ్‌ ఆర్డర్‌ అదనపు సీపీగా విక్రమ్‌ సింగ్‌ మాన్‌‌ని బదిలీ చేసింది.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీగా సుధీర్‌బాబు, మల్టీజోన్‌-2 ఐజీగా షానవాజ్‌ ఖాసిం, పోలీసు శిక్షణ ఐజీగా తరుణ్‌ జోషి, పర్సనల్‌ ఐజీగా కమలాసన్‌ రెడ్డి, మల్టీజోన్‌-1 ఐజీగా చంద్రశేఖర్‌ రెడ్డి, పీ అండ్‌ ఎల్‌ డీఐజీగా రమేశ్‌, ఇంటెలిజెన్స్‌ డీఐజీగా కార్తికేయ, రాజన్న జోన్‌ డీఐజీగా రమేశ్‌ నాయుడును బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు.. తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories