తెలంగాణలో అన్‌లాక్‌ దిశగా సర్కార్ యోచన.. నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ..

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 1:47 PM IST
Telangana Govt Plans to Lift Lockdown
X

తెలంగాణలో అన్‌లాక్‌ దిశగా సర్కార్ యోచన

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. దేశంలో పలు రాష్ట్రాలు అన్‌లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో తెలంగాణలో కూడా అన్‌లాక్‌ దిశగా సర్కార్‌ యోచిస్తోంది. నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లకు అనుమతిచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికలను సీఎంకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదే అంశంపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story