Telangana Jobs: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు..!

Telangana Jobs: నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు..!

Rama Rao
Updated on: 20 Jun 2022 1:04 PM IST
Telangana Govt Permission to Replace 10105 More Jobs
X

Telangana Jobs:నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు..!

Telangana Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకి మరొక శుభవార్త తెలిపింది. వివిధ శాఖలలో 10105 పోస్టులని భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్1, పోలీస్‌, ఎక్సైజ్‌, రవాణా తదితర శాఖల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టులు ఏ ఏ శాఖల్లో ఉంటాయో తెలుసుకుందాం.

ఇందులో గురుకులాల్లోనే 9096 పోస్టులున్నాయి. బీసీ గురుకులాల్లో 3870, గిరిజన గురుకులాల్లో 1514, ఎస్సీ గురుకులాల్లో 2267 పోస్టులు ఉన్నాయి. కాగా, ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక, ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశుసంక్షేమ శాలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగుల శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో నీటిపారుదల శాఖలో 931 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. శనివారం ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా అమోదం తెలిపింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Rama Rao

Rama Rao

Next Story