అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ.. ప్రభుత్వ ఉద్యోగులకు టైంకి జీతాలు ఇవ్వని దుస్థితి...

అప్పుల్లో కూరుకపోయిన తెలంగాణ.. ప్రభుత్వ ఉద్యోగులకు టైంకి జీతాలు ఇవ్వని దుస్థితి...
TS News: రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడంతో జీతాల ఇవ్వలేని పరిస్థితి...
TS News: తెలంగాణ ఉద్యోగులకు ఇంకా అకౌంట్ లలో జీతాలు జామ కాలేదు. ఒకటో తేదీన జీతాలు వచ్చే పరిస్థితి నుంచి 10వ తేదీ వచ్చిన జీతాలు పడే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్ ఉద్యోగులు 30,403 మంది, నాన్ గెజిటెడ్ రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది ఉద్యోగులున్నారు. రెండు లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. ఉద్యోగులకు చాలా నెలలుగా జీతాలు ఆలస్యంగా అకౌంట్ లో జమ అవుతున్నవి.
ప్రతి నెలా ఒకటో తారీఖున ఇయ్యాల్సిన జీతాలను ప్రభుత్వం విడతల వారీగా ఉద్యోగులకు అందిస్తుంది. ఉద్యోగులందరి అకౌంట్లలో జీతాలు పడేసరికి 10 వ తేది నుండి 12 వ తేది వరకు టైమ్ పడుతుంది. అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, నెలనెలా వస్తున్న ఆదాయంలో సగం కు పైగా పైసలు వడ్డీలు కట్టేందుకే సరిపొతుంది అంటున్నారు ఉద్యోగులు. నెల తిరిగే సరికి జీతాలు కావాల్సిన డబ్బులను సరిచేసే సరికి ఆర్ధిక శాఖ అధికారులకు తల ప్రాణం తోక కు వస్తుందని అంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు.
కొన్ని నెలల నుండి రాష్ట్రం లో ఒకటే రోజు అందరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడిన రోజు లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆదాయం సరిపోనపుడు రాష్ట్రాలు అప్పులు చేస్తుంటాయి. అయితే రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేoదుకు కేంద్రం FRMB చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయానికి మించి అప్పులు చేయరాదు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రం కావడంతో స్థూల ఆదాయంలో 3.5 శాతం వరకు అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటు ను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెబుతున్నారు అధికారులు. బహిరంగ మార్కెట్ల నుంచి తెచ్చిన అప్పులు చాలకపోవడంతో అదనంగా అప్పు చేయడానికి ప్రయత్నించింది.
కానీ కేంద్రం నిరాకరించడంతో పక్క దారిన అప్పులు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం అప్పులు చేయాలని అనుకున్న ప్రతిసారి అవసరం ఉన్న లేకున్నా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ పోతుంది. కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. కాంట్రాక్టర్స్ కి పెండింగ్ బిల్లులూ రావడం లేదని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులు కూడా సరైన టైమ్ కి రావడం లేదు. సరెండర్ లీవ్ ల బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులకు కూడా అంతే లేట్ గా ఇస్తున్నారట. చాలా మంది ఉద్యోగులు అత్యవసరం ఉండి GPF లోన్ అప్లయ్ చేసుకుంటే అవి కూడా లేట్ గా ఇస్తున్నారని వాపోతున్నారు ఉద్యోగులు. జీతాలు ఆలస్యంకి ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడమే అంటున్నారు అధికారులు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
LIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMTHeart Attack: హార్ట్ఎటాక్ రావొద్దంటే ఈ ఫుడ్స్ డైట్లో ఉండాల్సిందే..!
19 Aug 2022 9:30 AM GMTమునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి రాలేకపోతున్న కాంగ్రెస్
19 Aug 2022 8:47 AM GMT