Telangana: 64 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు

TS Govt Issued Showcause Notice to 64 Hospitals
x

తెలంగాణలోని 64 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు (ఫొటో ట్విట్టర్)

Highlights

Telangana: కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయింది.

Telangana: కరోనా టెస్టుల కోసం, అలాగే బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయింది. హైదరాబాద్‌లో 5 హాస్పిటల్స్‌ లో కరోనా సేవల లైసెన్స్‌ను ఆరోగ్యశాఖ రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌తో పాటు బేగంపేటలోని విన్‌ , కాచిగూడలోని టీఎక్స్‌, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్‌ హెల్త్‌, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రుల కొవిడ్ లైసెన్సులను రద్దు చేసింది.

మరోవైపు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రైవేటు హాస్పిటల్స్‌కు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఈమేరకు 48 గంటల్లోగా స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories