మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు

తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదాతో పదవులను కేటాయించింది.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 2:33 PM IST
మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు
X

మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాలు

తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదాతో పదవులను కేటాయించింది. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు....ప్రభుత్వ సలహాదారుడిగా బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిని నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యతను సుదర్శన్‌ రెడ్డికి అప్పగించారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ సుదర్శన్‌ రెడ్డికి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story