Top
logo

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త‌గా 11 మంది ఐపీఎస్‌ల‌కు పోస్టింగ్

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త‌గా 11 మంది ఐపీఎస్‌ల‌కు పోస్టింగ్
X
Highlights

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త‌గా 11 మంది ఐపీఎ‌స్‌లు చేరారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా...

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త‌గా 11 మంది ఐపీఎ‌స్‌లు చేరారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రం(ఎన్‌పీఏ)లో ఈ నెల 3వ తేదీన 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ కేడ‌ర్‌కు కేటాయించిన 2017, 2018 బ్యాచ్‌ల‌కు చెందిన 11 మంది ఐపీఎస్‌ల‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం శ‌నివారం పోస్టింగ్ ఇచ్చింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ క‌మాండ‌ర్లుగా 11 మంది ఐపీఎస్‌ల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం మీద తెలంగాణకు 11 మంది కొత్త ఐపీఎస్‌లు రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు మర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త‌గా నియామ‌కమైన ఐపీఎస్‌లు

1. అఖిల్ మ‌హాజ‌న్‌(2017 బ్యాచ్‌)

2. ఖారే కిర‌ణ్ ప్ర‌భాక‌ర్‌(2017 బ్యాచ్‌)

3. చెన్నూరి రూపేష్‌‌(2017 బ్యాచ్‌)

4. నితిక పంత్‌‌(2017 బ్యాచ్‌)

5. యోగేశ్ గౌతం‌(2018 బ్యాచ్‌)

6. స్నేహా మెహ్రా‌(2018 బ్యాచ్‌)

7. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌(2018 బ్యాచ్‌)‌

8. గైక్వాడ్ వైభ‌వ్ ర‌ఘునాథ్‌‌(2018 బ్యాచ్‌)

9. రితిరాజ్‌‌(2018 బ్యాచ్‌)

10. బిరుద‌రాజు రోహిత్ రాజు‌(2018 బ్యాచ్‌)

11. బి బాల‌స్వామి‌(2018 బ్యాచ్‌)

Web TitleTelangana govt gave posting to 11 IPS officers
Next Story