Night Curfew: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం

Night Curfew: తెలంగాణలో నైట్ కర్వ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Samba Siva Rao
Published on: 7 May 2021 7:57 PM IST
night curfew
X

నైట్ కర్ఫ్యూ ఫైల్ ఇమేజ్ 

Night Curfew: తెలంగాణలో నైట్ కర్వ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మరో వారంరోజులు పాటు మే 15 వరకు రాత్రి పూట కర్వ్యూను పొడిగించింది. ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణలోప్రస్తుతం 73,851 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో 5,892 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,81,540కు,2,625కు చేరాయి.

తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకున్నాక ప్రగతిభవన్ చేరుకుని అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చర్చించారు. కేసులు జూన్ వరకు తగ్గుముఖం పడతాయని, అప్పటి వరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story