Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం

Samba Siva Rao
Updated on: 30 April 2021 3:01 PM IST
Night Curfew
X

నైట్ కర్ఫ్యూ 

Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ప్రభుత్వం పొడిగించింది. మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన జీవోను సర్కార్ జారీ చేసింది. ఇప్పటికే కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో సర్కార్ మరో వారం రోజుల పాటు ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఓ పక్క నైట్‌ కర్ఫ్యూ ముగుస్తుంటే.. ఇంకా తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు 45 నిమిషాల సమయమిచ్చిన హైకోర్టు.. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story