Women's Day 2023: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్..!

Telangana Govt Declares Special Casual Leave for all Women Employees on March 8
x

Women’s Day 2023: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్..!

Highlights

Women’s Day 2023: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది.

Women's Day 2023: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్పెషల్​క్యాజువల్​లీవ్​ను ప్రకటిస్తూ సాధారణ పరిపాలన విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు సెలవు వర్తిస్తుంది.

అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తోంది. ఈ సారి కూడా అలాగే సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories